Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గత ఎన్నికల్లో మగాడిగా ఓటేసిన యోగేష్.. తాజా ఎన్నికల్లో యువతిగా పోలింగ్ కేంద్రానికి!

  • యువతిగా మారిన వడోదర యువకుడు
  • మోడల్‌గా రాణించేందుకు యత్నం
  • సోషల్ మీడియాలో హోరెత్తుతున్న మాన్వి పేరు
త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల అధికారులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనున్నారు. గత ఎన్నికల్లో యువకుడిగా ఓటు వేసిన వడోదరకు చెందిన యోగేష్ వైష్ణవ్ ఈసారి మాన్వి వైష్ణవ్‌గా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రానున్నాడు. గతంలో పురుషుడిగా ఓటరు కార్డు కలిగిన యోగేష్.. ఇప్పుడు మాన్విగా కొత్త కార్డును కూడా సంపాదించింది.

అబ్బాయిగా జన్మించిన యోగేష్ కొన్నేళ్ల వరకు అబ్బాయిలానే జీవించాడు. అయితే ఆ తర్వాతి నుంచి తాను అమ్మాయినని భావిస్తూ యువతుల దుస్తులను ధరించడం మొదలుపెట్టాడు. చివరికి ఇలా లాభం లేదనుకుని ఏకంగా సెక్స్ మార్పిడి చేయించుకుని యోగేష్ వైష్ణవ్ కాస్తా మాన్వి వైష్ణవ్‌గా మారిపోయింది. ప్రస్తుతం మోడల్‌గా రాణించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న మాన్వి 2012 గుజరాత్ ఎన్నికల్లో యోగేష్‌గానే ఓటేసింది. డిసెంబరు, 2015లో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని కొత్త ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకుంది. ఇప్పుడామెకు 31 ఏళ్లు. సోషల్ మీడియాలో మాన్వి పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఆమెకు విషెస్ చెబుతూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 
Gujarath
Manvi Yogesh
vadodara
Elections

More Telugu News